పాట ఎవరు పాడితేనేం
నా చెవుల్లో తేనెలూరేయి
పంచేంద్రియాల పరవశమంటే
తాదాత్మ్యత కాదా!
ఆరోహణావరోహణాలు
ఒడిదుడుకులు
గోపాలురు,పాలపుంత
నక్షత్ర శకలాలు
ఉత్తుంగ తరంగమూ
ఉపమానాన్ని మించిన ఉత్ప్రేక్ష
ఉనికిమరచిన నిరీక్షణ
పాట ఎవరు పాడితేనేం
నా చెవుల్లో తేనెలూరేయి
పంచేంద్రియాల పరవశమంటే
తాదాత్మ్యత కాదా!
ఆరోహణావరోహణాలు
ఒడిదుడుకులు
గోపాలురు,పాలపుంత
నక్షత్ర శకలాలు
ఉత్తుంగ తరంగమూ
ఉపమానాన్ని మించిన ఉత్ప్రేక్ష
ఉనికిమరచిన నిరీక్షణ