బ్రతికున్నప్పుడే బ్రతికుంటే
బావుంటుంది కదా
చచ్చేక బ్రతకడానికి
మనం చరిత్ర కాదు కదా
కవిత్వం
సిరా ఆరకుండానే
పంచ భూతాల్లో కలిసేప్పుడు
అనుభవించే క్షణాలే
అనుభవిస్తే…
ఎవరికోసమో బతికినట్టు
క్షణ క్షణ ప్రత్యక్ష ప్రసారంలా
ఊపిరి పీలుస్తున్నట్టు
నిశ్వాసం వదిలినట్టు
ఎవరితో పంచుకొంటున్నాం
ఊహా ప్రపంచానికి
నిజమెందుకు
నిశ్శబ్దానికి తప్పట్లెందుకు
మౌనానికి
మనస్సంగీతం చాలు కదా
ఉన్మీలనం వేళ
ధ్యాన సంద్రపు
మౌనభాష్యానికి తోడెవ్వరు
ఇంద్రధనస్సు కనిపించినప్పుడు
గణాంక సంకేతాలెందుకు?