స్వప్నం

ఒక కలని బంధించడానికి
ఇన్ని అలలు ఏరుకొంటానా
ఈ అలల్లో చిక్కుకొని
నాకు నేనే ఎక్కడున్నానో తేల్చుకోలేక
సుడిగుండంలాంటి
ఆత్మకల్పిత ప్రపంచంలో
తిరుగుతూ తిరుగుతూ

ఒక మాట పట్టుకొంటాను
దారికోసం దారంలా ఉంటుందేమోనని
దారం చేతిలోకొచ్చేసి
సూత్రం తెగిపోతుంది
ఇది కల-
రాత్రి ఏ జాములోనో
కలతనిద్దుర కదలకుండా పట్టుకున్నప్పుడు
కలవరించేనంటే ఎలా?

(సెప్టెంబర్ 85 నడిచివచ్చిన దారి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *