కాలానికీ నీటికీ
ఇసుకకీ కాలానికీ
స్ప్రింగుకీ ముల్లుకీ
ఏమిటి సంబంధం
జననానికీ గమనానికీ
ఏమిటి చుట్టరికం
ఎగిరే పక్షికీ
ఎదిగే మొక్కకీ
జాగృత్స్వప్నాల మధ్య
అహరహం జీవించే
మనిషికీ
కాలం కొలమానం ఎందుకు
నిరంతర చక్రనేమిక్రమంలో
నిత్య సుఖదుహ్ఖాల
ఉత్సవంలో
మైలురాళ్లెందుకు