కెరటం
నీటిలొ మునకేసినట్టు
తటాలున లేస్తుంది
శబ్దాలన్నీ కాంతితో కలిసి
విరగ పూసేయి
ద్రవీభూత పరిమళం
అద్దంలో ఆవిరయ్యింది
రాత్రి స్పర్శ తెలియని అపస్మారకంలో
పొద్దుతెలియని బిచ్చగాడి
వెతుకులాట
కెరటం
నీటిలొ మునకేసినట్టు
తటాలున లేస్తుంది
శబ్దాలన్నీ కాంతితో కలిసి
విరగ పూసేయి
ద్రవీభూత పరిమళం
అద్దంలో ఆవిరయ్యింది
రాత్రి స్పర్శ తెలియని అపస్మారకంలో
పొద్దుతెలియని బిచ్చగాడి
వెతుకులాట