ఒక రోజు నడుస్తూ వెతుక్కుంటూ
వెతుక్కుంటూ నడుస్తూ
దాటి పొయిన పొలిమేరల్లో
జ్ఞాపకం కనపడక
ఆదుర్దాలో
తనచుట్టూ తిరిగే భూమినయ్యేను

పాతకథలో ఈగలా
మర్చిపోయేను
ఏం మర్చిపోయేనో ఎవరికైనా తెలుసా
ఈ యూస్బీ డ్రైవ్ పనిచేయదేమో
తీగలన్నీ లాగుతోనే వున్నా
దాహం చెమటలు పట్టే వుక్క
కృత్యాద్యస్థ లాగే వుంది

కొత్త పద్యమా
నచ్చిన పాత పద్యమా
చటుక్కున జారిపోయిన
మెరుపు అనుభవమా
కొంచెం కనిపిస్తే ఇస్తారా….
మీ ఋణం వుంచుకోను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *