ఆఖరి పదం రాసేక
ఈ పద్యం బాగాలేదనిపించింది
కార్యాగారాల కారాగారాల నించి
బయటపడ్డాక
ఇన్నేళ్లూ చేసింది
గొడ్డు చాకిరీనే
కాగితమైతే చింపైగలం
గడిచినదినాల ముల్లు
వెనక్కి తిప్పగలనా
ఆగకుండా వినపడుతున్న గంటల్ని
వినకుండా వుండగల్నా
కళ్ళు తెరిచి సూర్యోదయాన్ని
వొళ్లు విరిచి అస్తమయాన్నీ
చూడని జీవితానికి
మెతుకు వెదకడమే
మెతుకు కతకడమే
పరమార్ధమైతే
మిగిలింది ఏ సంస్కారం ?
దహనమా ? ఖననమా?