అదే కథ

అదే కథ

వలసెళ్లినప్పుదు
కొత్తచోట
ఆమెనెత్తుకుపొయేరు
అతడు గొడవచేసి
వెనక్కి తెచుకొన్నడు

ఊర్లోవాడెవడో వెక్కిరించేడని
కడుపుతో వున్నావిడ్ని
వదిలేసేడు

ఒంటరిగా పిల్లల్ని పెంచి
పెద్దచేసి
అవమానభారంతో
మట్టిలో కలిసిపొయింది
అతడు నదిలో దూకి
ప్రాణం వదిలేడు
అదే అవతారం చాలించేడు