మళ్లీ మరోసారి
నీల మేఘాల కింద ప్రయాణం
మళ్లి ఇంకోసారి
హేమంత వృక్షాల దారిలో నడక

రాత్రి రేరాణీ ఉదయం పారిజాతం
రోజంతా బంతీ చేమంతీ
చలి మెలిదిరిగిన కాలంలో
నందివర్ధనం నవ్వులగుంపు
ముగ్గుల సందడై
బాల్య జ్ఞాపకాల పరిమళం

2

ఏసీ రొద కిటికీ మూసేసిన గది
మత్తు దిగని ఆల్కహాల్ నిద్ర
పెరడేలేని ఎపార్టుమెంట్ల బతుకు
ఋతువుల్లేని జనారణ్యం
డిస్కౌంటు బట్టల పండగమోత
కటౌట్లపై శుభాకాంక్షలు
లైకులూ కామెంట్లూ
ఊహా ప్రపంచంలో సంబరాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *