అమ్మమ్మ నీటి కథల్లొ
ఎండిపొయిన బావుల చరిత్ర ఉంది
ఉగ్గు గిన్నెలొ కూడా నింపేసిన
నిళ్ల జలజలలున్నాయి
నీళ్లు దాచుకొన్న గ్రీష్మ మేఘమై
జ్ఞాపకం బావిలొ చేదై
వేసవి ఎద్దడిలొ
ఘర్మజలాల తడిసి
పేలిన ఓళ్లై
తలుపులన్నీ తెరుచుకొన్న ఇల్లై
నీటి కొసమో గాలి వాలు కోసమో చీరచెరగు పర్చుకొని
గుమ్మం దగ్గర అర్ధ నిమీలితంగా
అమ్మమ్మ
వేసవి అద్దంలో ఒక ఒయాసిస్