వాగర్ధాల సంయోగమై

కోసిన పువ్వులన్నీ
జంగమ దేవర ఒంటి మీద
దండలయ్యేక

చలి విడిచి
కలకూజితాల
పచ్చని అడవి
వసంతానికి
ధనుష్టంకారమై

కోరికల కాటుకకొండ మీద
వెలుగు రేఖ ప్రేమ

ఎవరు కళ్లు తెరిస్తేనేమి?
ఎవరు బూడిదయితేనేమి?
ప్రేమ పుట్టలేదా?
వాగర్ధాల సంయోగమై
కుమార సంభవ మవలేదా!