Posted on August 1, 2025August 1, 2025 by Prasad Indraganti పదప్రవాళంపదాలకి పవిత్రత లేదుశబ్దానికి సాపేక్షత లేదుఅర్థమెప్పుడో అడుగంటిందికవితకి సారూప్యత లేదుఅద్దాల గదిలోఅబద్ధాల మాంత్రికత యుద్ధాల గడీలోఅవ్యక్త బాష్పజలధిబాధా పరిష్వంగంలోమాటలకందదు గాథ చెమరిస్తుందికాలార్ణవమవుతుందివలల్లో పడేది కాదుములిగి, నిండా ములిగినిలువీది చేసేపగడాల వేట కాలం చక్రంలా తిరగదునాలుగు దిక్కులూ ఎనిమిది మూలలూ ఆవిరి పడుతుందిచరిత్ర చర్వితచరణం కాదునిత్య సంచరణంమరణావరణంఅమరణ తరణంసుదూర తీరాల యానానికి నిప్పు తోడు జననావశేషాల జ్ఞాన సంచితం జోడుపదం ఎప్పటికైనాపదును తేలుతుందిజంత్ర ధ్వనితోద్వీపాలు తరిస్తుందిమంత్రమవుతుందికవితామంత్రణ మవుతుందికాలాన్ని దాటేఅంతర్గామి అవుతుంది