Posted on August 1, 2025August 1, 2025 by Prasad Indraganti యుగాంతమెప్పుడుఎన్నో వానాకాలాల తర్వాతఅరవైనాలుగో అంతస్తుఅపార్ట్మెంటు బాల్కనీలోచీకటిపడ్డ సాయంత్రం వేళమెరుపుల మధ్య చినుకులుకాగితం పడవలుపంచుకున్న చిల్లుల గొడుగులుమండువా ఇంట్లోకుంపటి మీద కాల్చిన అప్పడాలుఉడుకుతున్న ఆలుగడ్డఆవిరి ఒలుకుతోన్న అన్నంకరెంట్ పోయిన సాయంత్రంహరికేన్ లాంతరు వెలుగులోఒక్క కంచం ఆరుగురు పిల్లలువరసగా తెరుచుకునే నోళ్లుభూకంపం ముగిసేకకురిసిన జపాన్ వానచిల్లులు పడే ధారకాళ్ళకడ్డం పడుతూవరదలా నీరుహోటల్ గది కిటికీలో ముడుచుకున్న ముంగిసఎప్పటికీ ఆరని లోదుస్తులుతడి తగలని చోట చెమ్మ ఏళ్లకేళ్ళుఅరణ్య వాసం కొన్నాళ్ళైనా తప్పని రహస్య జీవితంఖనిజంలో లవణంగుర్తు తెలీని మరణంఎగరేసుకు పోయిన కాలంఎవరిదో తెలీని గాలిపటంతెల్లటి పక్కమీదబురదకాళ్లువచ్చి వెళ్లిపోయినఆనవాళ్లుఅది సరే,యుగాంత మెప్పుడు?