గుర్తుందా…

గుర్తుందా
“అనేక సాయంకాలాలు
మనం అదే పద్యం చదువుకుంటూ…”
….లాంతరు సన్నని వెలుతురులో కమ్ముకొని..

గుర్తుందా
ఒక సాయంత్రం
ఎన్ని పాటలు..
“గుండె గొంతుకలోన…”

గుర్తుందా
రాత్రంతా
కవులు, రచయితలు,
కథకులు, కళాకారులు..
“అజంతా,నామిని, మోహన్….”

గుర్తుందా
ఇద్దరమే, ముగ్గురమే
మాట్లాడుతూ..

రాత్రిరేవం వ్యరం సీత్
రాత్రిరేవ వ్యరం సీత్