రెండు రాత్రులు ఒకటే పవలు

అంత కష్టపడి
వెన్నెలా, నక్షత్రాలు
రాత్రిని వెలిగిస్తున్నాయి
ఏం లాభం
పగలంతా
అలిసిపోయేక
ఒళ్ళు తెలీని నిద్ర

****

వేల వేల పదాలతో
పద్యాలల్లేరు కవులు
అన్ని బాసల్లోనూ గుసుగుసలాడేరు
రాత్రంతా కలగంటూనే ఉన్నారు.

చాలు చాలు
తెల్లారింది
లేచి పనిలోకి దిగండి.
****

ఏది అలంకారం
ఏది భూపాలం
అన్నీ తానే అయి
చురుక్కుమనే కాలం