వాన పడుతో ఉంటుంది
ఆమె పద్యాలు
చదువుతో ఉన్నప్పుడు
నీరెండ కాస్తో ఉంటుంది
ఆమె గురించి మాట్లాడుతుంటే
పువ్వులు పరిమళాలన్నీ
జల్లుతూ ఉంటాయి
ఆమె కనుసన్నల్లో
కదులుతూన్నప్పుడు
రాత్రీ, పవలు, ఋతువులు
మనో చంచలనం
ఆమె సాన్నిహిత్యం
బింబ ప్రతిబింబాలు
ఆమె మాటలు చేతలు