వెతలే వెతుకులాట

తాడు కోసం వెతుకుతుంటే
బొంగరం దొరికింది
బొంగరం గుక్కపెడితే
గొంతు బొంగురుపోయింది

గొంతు పగిలి
తాడు బిగుసుకొని
మెడ సాగింది
కాళ్ల కానని నేల

నేల మీద నలికెల పాము
పాముల నర్సయ్య ఇంట్లో
గుడ్డు పులుసు
వెదురు బుట్టకింద
కోళ్ల సంత

కొబ్బరిడొక్కల్లో ఉరి
పెంకుల కపాలమోక్షం


రహస్యానికి రాత్రేమిటి?
పగలేమిటి?

అసురసంధ్య వేళ
ఎల్లెడలా రక్తం
తుడిచేసినా
చెరగని భక్తిమరక

దేవతల లీలావతి గణితంలో