త్యాగరాజుకి, అన్నమయ్యకి
లేని అదృష్టం
బాలు స్వంతం
చెవులున్నంత కాలం
వినగల మనసున్నంత కాలం
లోగొంతులో ధ్వనిస్తూ
గాలితో వీస్తూ
ఎన్ని తరాలైనా వేల వేల పాటలు
ఆయన గొంతులో వినగలం
పాట పార్థివ శరీరం కాదు
స్వరం గుప్పెడు బూడిద కాదు
అజరామరం నిత్యధ్వానం.
(25.9.20)