ఎవరైనా అడిగితే
చెవి కోసి ఇద్దామనుకుంటా
ఇంకా అడిగితే
తొడకోసి.
అయినా
నేనేమైనా వాంగో నా?
డేగలే కనపడని
నియంతలకాలం
అంతా అసంయుక్త హల్లుల మయం
చట్రాల్లో బతికే మనుషులకి
చట్టాలు తెలుస్తాయేమో గాని
చిత్తాలు తెలియవు
ఇవ్వడానికి తలనీలాలా
లాభనష్టాల బేరీజు వేసుకుని
దేవుడితో బేరాలాడుకొని
ఇచ్చిపుచ్చుకోవడాలు
సర్దుబాటు చేసుకొని
ఇంతకీ, ప్రేమ
దాపరికాలు,అంతరాలు, భేదాలు
దాటిన అలౌకిక చర్యేనా?
మనం మనల్ని మరిచే
కాలంలోనే ఉన్నామా?
26.8.20
(ఈ మాట అక్టోబర్ 2020)