ఉన్నావా? ఉన్నానా?

నువ్వు నాతో ఉన్నప్పుడు
నేను నీతో ఉన్నానా
నడుస్తున్నప్పుడు 

మాట్లాడుతున్నప్పుడు

లోలో ఆలోచిస్తున్నప్పుడు
నువ్వు నాతో ఉన్నావా
నేను నాతో ఉన్నానా

గింజలు జల్లినట్టు 

వాన మొలకెత్తినట్లు
చలి తడిసినట్లు 

కంకి పాలు పోసుకున్నట్టు

నాతో ఉన్నావా
నేను నీలో ఉన్నానా