నిన్న కొంతమందిని కలిసేను

నిన్న కొంతమందిని కలిసేను
ఇంటికొచ్చి చూద్దును కదా
శరీరం శల్య పరీక్షకి లోనయనట్టే

ఉద్యోగం, పుట్టుక, ఊరు,
కుటుంబం, చదువు,
పుస్తకాలు, పాటలు
ఆఖరికి అయిష్టాలు కూడా
ఎన్ని ప్రశ్నలు
నోరు తడారి పోయింది

నాకోసం ఏం మిగిలింది ఇంక!
ఒక్క ఏకాంతం తప్ప!