ప్రతి రాత్రీ
నన్ను పక్కలోకి
పిలిచేంత వరకు
నన్ను నేనే ప్రేమించుకుంటూ ఉంటాను
తలగడ మీద చోటిచ్చి
కాళ్ళు పక్కకి జరిపి
కళ్ళ మీద ముద్దుపెట్టి
తనలోకి తీసుకెళ్తుంది
నా కదలికలకు ఊతమిచ్చి
శ్వాసని నియంత్రిస్తూ
రెప్పలుమూసి
దుప్పటి కప్పి
మంత్రలోకానికి
ప్రయాణం చేయిస్తుంది
నిద్ర నా శయ్యంతర్యామి