ఆరుబయట
పక్షి పాట వినిపిస్తుంది
సాయంత్రం
ప్రార్ధన కోసం
పిలుపు కూడా
ఎక్కడో కంత వెతుక్కుని
సూర్యుడు
ఏదో ఒక వేళ మెరుస్తాడు
సెంట్రీలా పలకరిస్తూ
అప్పుడప్పుడు
ఉబుసుపోక
ఫైర్ అలారం మోగుతుంది
కాస్సేపటికి ఆగిపోతుంది
అమ్బులెన్సు శబ్దంకూడా
సమయం ప్రకారం
భోజనం దొరుకుతుంది
పుస్తకాలకి నిషేధంలేదు
కావాలంటే టీవీ పెట్టుకోవచ్చు
(ఎవరిక్కావాలి దుర్వార్తలు?)
ఆరోపణలు లేవు
రిమాండ్ కూడా కాదు
అయినా
ఇంట్లోనే ఉన్నానా!
జైల్లోనా?!