వయసు పెరిగి
పుట్టినరోజు నాటి
పుష్పగుచ్ఛం
వాడిపోయింది
కొత్తచొక్కా
మరక పడలేదు కానీ
మాసిపోయింది
ఎంతో నచ్చిన
పుస్తకం
ఇంక చదవాలనిపించటం లేదు
ఊడిపోతోన్న జుత్తుకి
రంగు వృధా
రేపటికన్నా
నిన్నే మిన్న అనిపిస్తోంది
వద్దనుకొన్నా
బాల్యమే పల్లకిలో
ఉరేగుతోంది
ముందు దారీ లేదు
గమ్యమూ లేదు
నడక మాత్రమే మిగిలింది
నడచివచ్చిన దారే
రహదారి