‘రాత్రికి రాజ్మా వండనా?’
పొద్దున్నే షూస్ వేసుకొంటుంటే అడిగింది
‘నీ ఇష్టం ‘
డబ్బాలో శాండ్విచ్ చూసుకొని
చెప్పేడు.
‘రేపు ఈ ప్రెజంటేషన్ తయారవ్వాలి’
బాగ్ సర్దుకొంటుంటే అన్నాడు
‘అయిపోతుంది’
‘లైసెన్స్ చూపించండి
గాలి ఊదండి’
‘ఇంతసేపా ఆఫీసులో’
వెళ్ళండి’
‘రొట్టెలు చల్లారిపోయేయి
ఏమాలస్యం?
ఏం పనో, రోజూ..’
టీవీ లో షాహిన్ బాగ్
తిలకం బొట్లు,
జెండాలు
ఆజాది…