పాత పుస్తకాలు

చిన్నప్పుడు
ఎవరో
చిత్తుకాగితాల్లో
పుస్తకాలు అమ్మేస్తుంటే
దుకాణం వాడినడిగి
తెచ్చుకున్నాను
‘అమృతం కురిసిన రాత్రి’

అబిడ్స్ ఆదివారం
రోడ్డుమీద
‘నగరంలో వాన’

టోక్యోలో
‘కాఫ్కా డైరీలు’
ముంబైలో
‘మిడ్నైట్ చిల్డ్రన్’

కవులు సంతకాలు చేసినవీ
పేజీ చివర్లలో వ్యాఖ్యానాలతోటి
అంటుకున్న కాగితాలు తెరవకుండానూ

వెతకాలే గాని
తీగలు దొరుకుతూనే ఉంటాయి
వెలుగు నింపుతూనే