రాత్రి ఎలా గడిస్తేనేమి,
ఉదయం
చెంపపిన్నులు, జుత్తు కొసళ్ళు
పక్క దులిపి
దుప్పటి మారిస్తే
మంచం పక్క
చెత్తబుట్టలో
కవరు తీసి ముడివేసి
గది వాక్యూమ్ చేసి
బాత్రూం కడిగి
అద్దం తుడిచి
సబ్బు మార్చి
తువాళ్ళు సద్ది
తలుపేస్తోన్నప్పుడు
కనిపించింది
అద్దంలో అలసట
ఇంకా బోలెడు గదులున్నాయి
సర్దడానికి