అచ్యుతరామయ్య ఆత్మీయుడుగా, బంధువుగా,కవిగా 5 దశాబ్దాల పైగా పరిచితుడు. ప్రేమోపజీవి. పిల్లలంటే వల్లమాలిన ప్రేమ.
మా ఊళ్ళో పనిచేసిన కాలంలో మా అమ్మని నాన్నగారిని తరచుగా కలుస్తూ, పిల్లలు దూరంగా ఉన్నారనే లోటు లేకుండా కనిపెట్టుకు చూసేడు.
చతురత, సమయస్ఫూర్తి, సునిశిత దృష్టి, అవగాహన, మానవీయ దృక్పథం ఇంకా క్లుప్తత ౼ కవిగా అతని బలసంపద. వ్యక్తిగా కలుపుగోలు మనిషి. మినిమలిస్ట్.
పుస్తకానికి ముందుమాటా అంకితం రాసుకుని పని పిల్లాడికొదిలి వెళ్లిపోయేడు.
ఆలస్యం అయినా, పుస్తకం రావడం సంబరంగా ఉంది.
కుటుంబ సభ్యులకు నా అభినందనలు.
ఇంద్రప్రసాద్
దోహా 13.5.2019