క్షమించండి

ఇప్పుడే తెల్లారింది
పచనం కాని
ఆలోచనల్ని
గోడలమీద
వమనం చేయకండి

కాస్తంత విశ్రమించండి
పూర్తిగా నిద్ర తీరేక
రాత్రి మద్యపాన విశేషాలన్ని
బయటకు వెళ్లిపోయేక
గుక్కెడు నీళ్లు పుక్కిలించి
ఇష్టమైతే స్నానించి

ఇప్పుడు చెప్పండి
“సూర్యుడు ఎటు ఉదయిస్తాడో?”
“హిమాలయాలు ఎటు ఉన్నాయో?”

Leave a Reply