రంగుల జడి

మనం ఇంటి దగ్గర
బయలుదేరినప్పుడు
నీ మాటలతోటే నడుస్తున్నాను

గాలి చల్లబడుతోంది
నీ ఉద్వేగపు ఉచ్ఛ్వాసం తెలుస్తోనే ఉంది.

నువ్వు మధ్య మధ్య అడుగుతూనే ఉన్నావు
వింటున్నావా..
ఊ కొడుతూనే వున్నాను.
ఇంక నా వల్లకాదు
కుంగుతోన్న సూర్యుడు
నీ కంటే ఎక్కువ గట్టిగా పిలుస్తున్నాడు
రంగులన్నీ విసిరి
హొలీ ఆడిస్తున్నాడు.
నీ మాటలే విననా,
రంగుల జడిలో
స్నానమాడనా!