కాలం ఇవాళ పుట్టలేదు
మనిషీ ఇవాళ పుట్టలేదు
రాత్రీ పవలూ నక్షత్రాలూ
చంద్రసూర్యులూ
ఏవీ కొత్తవి కావు.

పుట్టే ఆకు ఎండుతూనే
రాలే ఆకు వెనుక
కొత్త చిగురు మొలకెత్తుతూ
చక్రం కదులుతూ

అయినా నిత్య భ్రమణ
జవజీవాల
భ్రమావిభ్రమాల మధ్య
కొత్త సంబరం

One thought on “కొత్త సంబరం ౼ ఉగాది

Leave a Reply to Padmapadmapv Cancel reply