రాత్రీ పగళ్లలా
ప్రశ్నలూ జవాబులూ
ఉంటే బావుణ్ణు..
కొంచెం అటూ ఇటూ గా
తేటతెల్లమయ్యేది
ఇంత ఊగిసలాట ఉండేది కాదు
ఎంత సందిగ్ధం!
ప్రశ్నలకి జవాబులు చిక్కుకొని
ఉండేవి చిన్నప్పుడు
ఇప్పుడు
సమాధానాలకోసం
చాలానే వెతుక్కోవాలి.
నీడలకి, వెల్తురుకి
ఉన్న సంబంధంలా
ఉహకి వాస్తవానికి చుట్టరికం
ఉంటే బావుణ్ణు
నిజానికి నిశ్శబ్దమే మేలు
అబద్ధానికి మాటలెక్కువ
గాల్లో తిరుగుతూ ..
చెవికి సీసం పోసుకొన్నా
మనస్సుని పీడిస్తూ.