ఎవరు వింటారు నా మాట?

రాత్రిని విడగొట్టి
చీకటిని
తప్పిద్దామనుకొంటాను

చీకటినంటించి
పగల్ని
జలజల పారే
రాత్రిలా మారుద్దామని..

గాలినీ, నీటినీ
ఆకాశాన్నీ
రూపురేఖలు
మార్చుకోమంటాను

ఎవరు వింటారు
నా మాట?

నేనే
బాల్యాన్ని
తొడుక్కొని…