నీ దారి చూస్తూ
నా చేతిలో పని
దృష్టి తప్పుతుంది
చదువుతోన్న పుస్తకం
పేజీలు తిరుగుతాయి

గ్రహణ శక్తి కోల్పోయేక
ఎన్ని దృశ్యాలు కళ్లముందు కదిల్తేనేం

చీకటి కూడా
కంటికి చూపు నిస్తుంది
శబ్దాల మధ్య
త్రోవ ఇచ్చిన యమునలా
నీ అడుగుల చప్పుడు జల్లెడ పడుతుంది

నీ దారి చూస్తూ
నేను ప్రవాహమవుతాను
నేను స్థాణువునై
నిరూపమవుతాను

నీ దారి చూస్తూ
నాదారి నౌతాను

Leave a Reply