ఎండలు మండుతోనే
ఒక సాయంత్రం ఉక్కపోసి
ఈదురుగాలులతో
కకావికలమయ్యేక
జల్లు కురుస్తుంది
లేచి వచ్చిన ప్రాణం

గాలితిరిగి ఎండ జారి
మబ్బు పట్టి
వానే వానన్నట్టు
వానాకాలం
ఏనుగుల్ని అద్దెకు తెచ్చుకొని
కురుస్తుంది తొండాలతో
నేలానీరు ఒకటే

నింగినీరు కలిసి
తెరిపిచ్చిన క్షణాల
ఇంద్రధనుస్సు ఉల్లాసం

ఎండాకాలాన వానా
వానాకాలాన ఎండా
ఉల్లాసమే ఉత్సాహమే

ఆరు పేటల కాలానికి
ఎండా వానా రెండు జడలు.

Leave a Reply