చర్మ రంధ్రాల్లోంచి
ఉబికివచ్చే స్వేదంలా
చలత్ చంచల జీవితం
కొత్త రంగుల మయం
పలిత కేశాలూ
కళ మారే దేహమూ
గురి తప్పిన చూపూ
మతిమారిన తోవా..
బింబం వంటిదే
ప్రతిబింబం కూడా
అద్దంతో విభేదించి పనిలేదు
రంగులూ హంగులూ
అమర్చుకోవడం కన్నా
దేహగేహంలోకి చూసే
కొత్త దుర్భిణి కావాలి