చదువుకోడానికి
తెరిచిన కిటికీ..

చెట్టు మీద
దోరజాంపండు కొరుకుతూ చిలక..

ఎదురింటి మేడ మీద
ముదురు నారింజె

సైగల దారాలతో
సంకేతాల
గాలి పడగలు

పక్షి రెక్కలు విసిరి
కిటికీలోంచి
పుస్తకం ఎగిరి
సాయంత్రమయ్యింది

సన్నజాజుల గుబాళింపు

ముఖం కడుక్కుని
నడక తీయాలి

Leave a Reply