పుట్టిన ఊరు
పెరిగిన నగరం
ఆఖరికి దేశమే ఒదిలి ఒచ్చేక..

పరగలేరుకొని
అగ్గి వెలిగించుకొని
తాడు మీద నడిచేవాళ్లకి
డప్పు వాయించుకొంటూ..

ఆకలి – ఆశ్చర్యమేమీ లేదు

ఆటే – చూసేవాళ్లకి ఆటే..

సరిహద్దుల్లో తడిమే కాగితాల్లా
అంతా సోదాయే..

ఎక్కడ ఎవర్ని ఒదిలివచ్చేమో
ఎక్కడ ఎవరు జారిపోయేరో

తాడూ డప్పూ..

ఇటుకలూ, ఇసుకా
మొబైలూ, బిడారులో గుడారం

ఇప్పుడు మాట వినిపిస్తుంది
దూరం తగ్గినట్టే తగ్గి
సుదూరమై

డప్పు చేతిలో..

తాడూ బొంగరం
ఎక్కడ?

Leave a Reply