ఉప్పాడ ప్రయాణం

రానూ పోనూ పన్నెండు మైళ్లు
సైకిలు తొక్కడం గుర్తుంది
తోవలో తాగిన సోడా కూడా..

మధ్యలో సాయంత్రం ఎండకి
చెట్టుకింద కాస్సేపు ఆగి
పొగ ఒదలడం గుర్తుంది

చీకటిపడ్డ తిరుగు ప్రయాణంలో
చెరుకుబళ్ల వరసలో
ఇరుసు చప్పుళ్లమధ్య
కూనిరాగం వెలుగు జల్లడం కూడా

కాని మన ఉప్పాడ ప్రయాణంలో
సముద్రపు అలల చప్పుడు
ఎంత తరిచినా జ్ఞాపకం
రావడంలేదు

ఇన్ని తలపోతలమధ్య
వెక్కిరిస్తూ పున్నమి చందమామ