నిద్రనొదిలేసి…

ఈసారి ప్రయాణంలో
నిద్రనొదిలేసి
కలని తెచ్చుకొన్నాను
మొదట్లో అంతా రంగులే
తర్వాత ఏది నలుపో
ఏది తెలుపో తెలీని
చుక్కల చుక్కల
మసక మసక
పాత సినీమా..

నిన్నటినించీ కలా లేదు
నిద్రా లేదు
ఒట్టి పొడికళ్ళే
మామూలు ఆఫీసు జీవితం