ఎప్పుడో తోటల్లో తిరిగినట్టు గుర్తు
మాట్లాడుకొనేవాళ్లం
దేనిగురించో…
పళ్లు కట్టించుకొన్నాక
వుత్తినే ఆడించే దవడలా
అరిగిపోయి మసకబారిన
కళ్లద్దాల్లా
కనిపించినంతే కనిపిస్తుంది
ఈ జ్ఞాపకం ఒకటి
గుర్తొచ్చినంతే గుర్తొస్తుంది
కలగాపులగంగా
కాలరేఖ చెదిరినట్టు
ఉదయమే చీకటిపడ్డట్టు
తొందరపడ్డ వేసవిలా
దాహర్తమై
అరుగుమీద అసంబద్ధంగా…
కొంచెం కొంచెంగా
నిన్నటి జ్ఞాపకమే
ఇవాళ జారిపోయింది