చొక్కా  విప్పి

దండేనికి తగిలించేక

ఈ సాయంత్రం ఇంక నా సొంతమే

పక్క దులుపుకుని పడుకొనే దాకా

అక్షరాలు కళ్లనంటుకొని వదలవ్

పద్య సహస్రాల భారతమో

గద్య నాటకం కన్యాశుల్కమో

గుడ్డ కుర్చీ, కళ్లజోడూ

కప్పు టీ

గ్లాసుడు మంచినీళ్లూ తోడుంటే

సంధ్యకి తలవంచి

వందనం చెయ్యనా!

తలపుల విశ్వానికి

తలుపులు తెరవనా!

Leave a Reply