తూనీగా-వేరే ఒక జ్ఙాపకం

​చేతిలో కొత్త బొమ్మపెడుతూ

శివాజీ గారు
అన్నారు కదా
‘తూనీగ వర్షానికీ
హర్షాతిరేకానికీ
సంకేతం. శుభసూచకం’

చాలా ఏళ్ల కిందట
నది దాటి గుడికెళ్లి వచ్చేక
ఆవిడడిగిందికదా
‘మళ్లీ ఎప్పుడొస్తావు?’

ఉదయాస్తమయాల
ఉష్ణరశ్మిలో
రాత్రిందివాల శీతలవాతూలాలలో

‘జ్ఙాపకాల చేతిసంచీ
తేలికయ్యేక
అంతర్ముఖుణ్నై
రెక్కలల్లార్చుకొని
సీతాకోకచిలకనై వాలనా!