సూర్య ప్రవాహం

అక్షరమొక సాయంత్రమై
ఒడ్డున కూర్చున్న సముద్ర కెరటమై
నిశాదీప కాంతిలో
పద సమూహమై
మేజా మీద సుతారంగా నిల్చో వున్న ద్రవమై
తడబడి
ఆలోచనల్లో నడిచి
సాంద్ర కవితా కిరణమై
ఉబికివస్తే
అది ఉదయం
తూర్పు జటాజూటంలోంచి
సూర్య ప్రవాహం

(నడిచివచ్చిన దారి మార్చ్ 92)