నిష్క్రమించిన సూత్రధారి

జ్ఞాపకమూ నేనూ
ఎదురుబొదురు గా కూర్చొని
ద్రాక్ష సారా సేవిస్తున్నాం
మాటల మధ్య
మళ్లీ మళ్లీ
సీసా వంచుకొంటూ…
బాల్య యౌవనాల
తలపుల సంధిలో
జుట్టు పైకెగ దోసుకొని
కళ్లు విప్పార్చుకొని
కదిలే గుంపులో
కదలని స్థిర చిత్రం కోసం
వెతుకుతూ…

సంధ్యారుణ కాంతి
వంతెనమీంచి జారి
తమాలవృక్ష శాఖల మీంచి
జాణతనపు జాబిలి నవ్వుతో
వేసవి పరిమళాల
నైట్ క్వీన్ గాలి

నిష్క్రమించిన సూత్రధారి
రంగస్థలం మీద
నేనూ ఖాళీ గ్లాసులో
హెరల్ద్ పింటరూ