అలౌకికం

మూడంకాల మధ్య
ప్రశ్నల గుంపులోంచి
ఆమె అడిగింది కదా
ప్రేమ ఇంత భౌతికమా?
అలౌకికమనో
నిర్మలమనో
అమలినమనో
అనుకుంటూ ఉన్నానిన్నాళ్లూ..

వాన పడ్డప్పుడో
ఎండమండినప్పుడో
చలి వణికించినప్పుడో
శ్రమ మెలిపెట్టినప్పుడో
తడవడం అలవడం
గజగజలాడడం
సొమ్మసిల్లడం
అలౌకికమా?
నిర్మలమా?

శరీరం భౌతికమే
శరీరానుభవాలూ భౌతికమే
నెమరేసుకోవడం..
తపించడం…