మూడంకాల మధ్య
ప్రశ్నల గుంపులోంచి
ఆమె అడిగింది కదా
ప్రేమ ఇంత భౌతికమా?
అలౌకికమనో
నిర్మలమనో
అమలినమనో
అనుకుంటూ ఉన్నానిన్నాళ్లూ..

వాన పడ్డప్పుడో
ఎండమండినప్పుడో
చలి వణికించినప్పుడో
శ్రమ మెలిపెట్టినప్పుడో
తడవడం అలవడం
గజగజలాడడం
సొమ్మసిల్లడం
అలౌకికమా?
నిర్మలమా?

శరీరం భౌతికమే
శరీరానుభవాలూ భౌతికమే
నెమరేసుకోవడం..
తపించడం…

One thought on “అలౌకికం

  1. “ప్రేమ ఇంకా భౌతికమేనా” అంటూ Antarjalayaatra – లో తరిచి తవ్వుకున్నా, “ప్రేమ ఇంత భౌతికమా?” అని ప్రశ్నించబడినా… ప్రేమ అలౌకికం/అనుభూతి, శరీరం భౌతికం/అనుభవం – ఆ ద్వంద్వం లోని ద్వంద్వాతీతమైనదేదో మనసు తపన అని నేను అనుకుంటాను.
    (కొంత మౌనం తప్పని, మరి కొంత మౌనం తప్పా మరేమీ లేని సమయాలు; మీ కవితలు చదువుతున్నాను అని చెప్పటం మాత్రం కాదు ఈ వ్యాఖ్య! చదవటం నా కొరకు అయినప్పుడు అది మీకు చెప్పి మరేదో ప్రదర్శనాభిలాష ఎందుకన్న వైనం…)

Leave a Reply to మరువం ఉష Cancel reply

Your email address will not be published. Required fields are marked *