చెప్పుకోడానికే ఎడారి కానీ
ఇంతమంది మనుషుల మధ్య
ఊరు అఖండదీపంలా వెలుగుతోనేవుంది
జ్ఞాపకం కంటి అద్దంలా అంటి పెట్టుకునే
మజిలీలో తడువుకొన్న మనీపర్సు
పిల్లదాని చదువుఖర్చుకి
ఇంకా నెల్లాళ్ల శ్రమ బాకీ.
మిస్సుడు కాలుల మొబైలు ఫోను
ఎవరు కలవరిస్తున్నారో
పెళ్లాల పిల్లల జ్ఞాపకాల తలగడలు
తల్లుల తమ్ముళ్ల అక్కల బాధ్యతల
ఆశల పొలాల్లో ఏ విత్తనాలు జల్లుతున్నారో
ఉదయకాంతి సూర్యతేజమై
మరో వేడిగాడ్పై
మనస్సుని కకలావికలం
చేయడానికి ముందే….