నెరిసిన గెడ్డం, రంగేసిన జుత్తూ
లెడ్జెర్ ముఖం, ఆఫీసు తొడుగులూ విప్పేసి
వంటింట్లో ఆమె చుట్టూ తిరిగినప్పుదు
బాల్యం ఉత్సవమూర్తై ఊరేగినట్లే
పొరలు పొరలుగా ఒంటికంటుకొన్న
కల్మష కవచాల్ని ఒలిచి
అట్టకట్టుకుపోయిన కృత్రిమత్వాన్ని
విదిలించుకొంటే
ఎర్ర బొప్పాయి సంజె బాల్యం
అనాచ్చాదిత బాల్యంలా
తలకడిగిన రోజులా
ప్రతి రోజూ విచ్చుకొనే పువ్వుల్లా
జీవితం సరాగాల
నర్తనశాలైతే బావుణ్ను
Regards,
Prasad
Sent from my iPad