చిన్నప్పుడు తాతబడిలో

చిన్నప్పుడు తాతబడిలో
చదివేటప్పుదు
ఒళ్లంతా ఎర్రమట్టి

పొలానికి అన్నం పట్టికెళ్లినప్పుదు
సైకిలెప్పుదూ ఒండ్రు మట్టే
అక్కడంతా బంక మట్టి

పత్తి మూటల బజార్లో
నల్ల రేగడి నిలువుటద్దం

గొప్పుతవ్వి కుండీలొ పువ్వు పరిమళంకొసం
తెచ్చిపోసిన పచ్చమట్టి

సవాలక్ష రంధ్రాలతొ
మట్టిచప్పుళ్ల చలివేంద్రం

ఎడారి ఇసుకలో
మట్టి పాట
జ్ఞాపకాల
తలపోత